కడెం ఎడమ కాలువ సాగునీటిని యథావిధిగా కొనసాగించాలిపంట చేతికి వచ్చే వరకు నీరందించాలి : బీఆర్ఎస్ నాయకుల డిమాండ్

దస్తురాబాద్, నవంబర్ 04(ప్రజా ముద్ర న్యూస్) : కడెం ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా అందిస్తున్న సాగునీటి సరఫరాను యథావిధిగా కొనసాగించాలని, పంటలు పూర్తిస్థాయిలో చేతికి వచ్చేంత వరకు నీటిని నిలిపివేయకూడదని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భూక్యా జాన్సన్ నాయక్ ఆదేశాల మేరకు బుధవారం దస్తురాబాద్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఇప్పటికే రైతులు పంటల సాగు కోసం అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టారని తెలిపారు. ఇలాంటి కీలక...