హార్వెస్టర్ కింద పడి రైతు దుర్మరణం.. పెద్దమ్మగడ్డ తాండాలో విషాదం

వెల్దుర్తి, నవంబర్ 03(ప్రజా ముద్ర న్యూస్) : మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం పెద్దమ్మగడ్డ తాండాలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. పొలంలో వరి కోతలు జరుగుతున్న సమయంలో హార్వెస్టర్ కింద పడి రైతు లంబాడి శంకర్ నాయక్ (46) ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దమ్మగడ్డ తాండాకు చెందిన లంబాడి శంకర్ నాయక్, తండ్రి మాన్సింగ్, గత పదేళ్లుగా కొండాటి అనుమంతరావుకు చెందిన మూడు ఎకరాల వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాడు....