రూ.20 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ వ్యవసాయ అధికారి

సంగారెడ్డి, నవంబర్ 03(ప్రజా ముద్ర న్యూస్): సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట మండల వ్యవసాయ అధికారి జి. రమేష్ రూ.20 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. మంగళవారం సదాశివపేటలోని కార్యాలయంలో ఫిర్యాదుదారుడి నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..ఫిర్యాదుదారుడి అల్లుడు నిర్వహిస్తున్న ఎరువుల వ్యాపారం సజావుగా కొనసాగేందుకు అధికారిక సహాయం చేస్తానని చెప్పి మొత్తం రూ.30 వేల లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ వెల్లడించింది. ఇందులో భాగంగా గత అక్టోబర్...