సంగారెడ్డి, నవంబర్ 03(ప్రజా ముద్ర న్యూస్): సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట మండల వ్యవసాయ అధికారి జి. రమేష్ రూ.20 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. మంగళవారం సదాశివపేటలోని కార్యాలయంలో ఫిర్యాదుదారుడి నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..ఫిర్యాదుదారుడి అల్లుడు నిర్వహిస్తున్న ఎరువుల వ్యాపారం సజావుగా కొనసాగేందుకు అధికారిక
సహాయం చేస్తానని చెప్పి మొత్తం రూ.30 వేల లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ వెల్లడించింది. ఇందులో భాగంగా గత అక్టోబర్ 19న రూ.10 వేలు ఇప్పటికే తీసుకోగా, మిగిలిన రూ.20 వేలు తీసుకుంటున్న సమయంలో అధికారులు పట్టుకున్నారు. లంచం సొమ్మును వ్యవసాయ అధికారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆయనను అరెస్ట్ చేసి హైదరాబాద్‌లోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కేసు ప్రస్తుతం దర్యాప్తులో ఉందని, ఫిర్యాదుదారుడి వివరాలను భద్రతా కారణాల దృష్ట్యా గోప్యంగా ఉంచినట్లు వెల్లడించారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని సూచించారు. వాట్సాప్ నంబర్ 9440446106 ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని ఏసీబీ తెలిపింది.