రాప్తాడు ఉన్మాది హేమంత్ కాలు తొలగింపు.. కఠిన సెక్షన్లతో కేసు

అనంతపురం, నవంబర్ 03(ప్రజా ముద్ర న్యూస్) : ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో సంచలనం సృష్టించిన రాప్తాడు (Raptadu) ఘటనలో నిందితుడైన హేమంత్‌కు వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన ఈ ఆపరేషన్‌లో హేమంత్ కుడి కాలును మోకాలి పైవరకు తొలగించినట్లు అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ మల్లేశ్వరి ధృవీకరించారు. నిందితుడి ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా వైద్య బృందం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ శస్త్రచికిత్స ప్రక్రియను వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారని వైద్య విభాగం వెల్లడించింది. మరోవైపు, ఈ...