చింతగూడ జడ్పీ ఉన్నత పాఠశాలకు నూతన భవనం మంజూరు చేయాలి

ప్రజావాణిలో జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన మేకల అక్షయ్ కుమార్.. శిథిలావస్థకు చేరిన తరగతి గదులు.. జన్నారం, నవంబర్ 02(ప్రజా ముద్ర న్యూస్) : మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చింతగూడ గ్రామంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల భవనం శిథిలావస్థకు చేరిందని, వెంటనే నూతన భవనాన్ని మంజూరు చేయాలని చింతగూడ గ్రామపంచాయతీ 2వ వార్డు సభ్యుడు, రాష్ట్ర విద్యార్థి సంఘం నాయకుడు మేకల అక్షయ్ కుమార్ కోరారు. సోమవారం మంచిర్యాల కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన 'ప్రజావాణి' కార్యక్రమంలో భాగంగా ఆయన జిల్లా పాలనాధికారి...