PRAJA MUDRA NEWS
Newspaper Banner
Date of Publish : 02 November 2026, 9:32 am Posted by : PRAJA MUDRA NEWS

చింతగూడ గ్రామ కాంగ్రెస్ కమిటీ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక

జన్నారం, నవంబర్ 01(ప్రజా ముద్ర న్యూస్) : మండలంలోని చింతగూడ గ్రామ కాంగ్రెస్ కమిటీ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అజ్మీర నందు నాయక్, ప్రధాన కార్యదర్శి మేకల మాణిక్యం ల ఆధ్వర్యంలో ఈ ఎన్నిక నిర్వహించారు. అధ్యక్షుడిగా మైదం మల్లేష్, ఉపాధ్యక్షులుగా పానగంటి శ్రీనివాస్, లాకావత్ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా మునేసుల శంకర్, కార్యదర్శులుగా బీర్పూర్ తిరుపతి, కొండుకూరి నరేష్, ప్రచార కార్యదర్శిగా నీరటి రాజేందర్, సలహాదారులుగా లాకావత్ నందునాయక్, తాటి శ్రీనివాస్, ఆరే సురేష్, బత్తుల లక్ష్మిరాజం, సీపతి కిషన్, నాసాని మల్లికార్జున్, అలిశెట్టి నర్సయ్య, మేకల రవి, దాసరి గిరీష్, అజ్మీర తిరుపతి లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన నాయకులు మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. తమపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ కి, మండల నాయకులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.