మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల పోరండ్ల లో శనివారం రోజున FLN (Foundational Literacy and Numeracy) లో భాగంగా రూపొందించిన ‘AXL LAB ను గ్రామ సర్పంచ్ నక్క హరీష్ మరియు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు మురళి మోహన చారీ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. విద్యార్థుల్లో ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యా శాస్త్ర నైపుణ్యాలను పెంపొందించడానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. ప్రతి విద్యార్థి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని చదువులో ముందంజలో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మల్లేశం గౌడ్, పంచాయతీ సెక్రెటరీ కృష్ణ చైతన్య, 1వ వార్డు మెంబర్ బాలు, పాఠశాల AAPC కమిటీ చైర్మన్, పాఠశాల HM సుజాత, పాఠశాల ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు.