PRAJA MUDRA NEWS
Newspaper Banner
Date of Publish : 31 October 2026, 3:18 am Posted by : PRAJA MUDRA NEWS

అనాధ పిల్లలకు ఆర్థికసాయం అందజేసిన TGWWC

జన్నారం, అక్టోబర్ 30(ప్రజా ముద్ర న్యూస్) : మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రాంపూర్ లో గత మూడు సంవత్సరాల క్రితం ఓరగంటి (మోతే) దివ్య భర్త లింగయ్య అనారోగ్యంతో మరణించారు. ఇటీవల దివ్య కూడా అనారోగ్యంతో మరణించింది, ఇద్దరూ పిల్లలు అమూల్య(11), స్పందన(9) కూడు గూడు లేని అనాధలుగా మిగిలిపోయారు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి(TGWWC) రాంపూర్ కమిటీ ఆధ్వర్యంలో మరియు దాతల సహకారంతో రూ.93,200 లు మొత్తాన్ని పిల్లల పేరు మీద బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. ఈ సహాయంతో పిల్లలు చదువుకోవాలని మరియు భవిష్యత్తులో వారు ఉన్నతస్థానాలకు ఎదుగలని తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు కల్లెడ భూమయ్య కోరారు. రాష్ట్ర కన్వీనర్ సుదర్శన్ మరియు గ్రామ అధ్యక్షుడు లింగాల వెంకటేష్ మాట్లాడుతూ.. గల్ఫ్ కార్మికులకు మరియు గ్రామ ప్రజలకు మా వాంతు సహాయం చేస్తాం అని తెలిపారు. ఈ సాయం కొరకు మతో పాటు విదేశాల్లో ఉండి పరోక్షంగా సహకరించిన ఓరగంటి వెంకటేష్, సంతపురి రమేష్, కల్లెడ లచ్చయ్య, పందిరి రాజేష్, కొండ్ర నారాయణ లకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని భూమయ్య అన్నారు. గ్రామ సర్పంచ్ నూతి రామయ్య, మాజీ సర్పంచ్ అలుగునూరి పద్మారావు లు మాట్లాడుతూ.. తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి రాంపూర్ కమిటీ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలతో పాటు సంతపురి రాజేష్, రేషవేని లచ్చన్న, చిరంజీవి, వెంకటేష్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.