హైదరాబాద్‌ ప్రయాణికులకు ఆర్టీసీ తీపి కబురు.. ఇక పుష్పక్ ఏసీ బస్సుల్లో సామాన్యులకూ ప్రవేశం!

హైదరాబాద్, అక్టోబర్ 30(ప్రజా ముద్ర న్యూస్) : నగరంలో నిత్యం ప్రయాణించే పౌరులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) బిగ్ రిలీఫ్ ఇచ్చింది. ఇప్పటివరకు కేవలం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయ ప్రయాణికులకు మాత్రమే పరిమితమైన ‘పుష్పక్ ఏసీ’ (Pushpak AC) బస్సులను ఇకపై సాధారణ ప్రజలు కూడా వినియోగించుకునేలా ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలోని వివిధ ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించే సామాన్య ప్రయాణికులు కూడా ఈ లగ్జరీ ఏసీ బస్సుల్లో ప్రయాణించవచ్చు. వేసవి ఎండలు, నగర ట్రాఫిక్ నరకం...