రాహుల్ కాంబ్లే కుటుంబానికి న్యాయం చేయాలి: టీపీసీసీ ఎస్సీ డిపార్ట్‌మెంట్ వైస్ ఛైర్మన్ దుర్గం శేఖర్

ఆదిలాబాద్, అక్టోబర్ 30(ప్రజా ముద్ర న్యూస్) : ఆదిలాబాద్‌కు చెందిన రాహుల్ కాంబ్లే ఆత్మహత్య ఘటనపై సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని టీపీసీసీ ఎస్సీ డిపార్ట్‌మెంట్ వైస్ ఛైర్మన్ దుర్గం శేఖర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా దుర్గం శేఖర్ మాట్లాడుతూ.. రాహుల్ కాంబ్లే ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై, ఈ ఘటన వెనుక ఉన్న అన్ని కోణాలపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని కోరారు....