ప్రభుత్వ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన మండల పంచాయతీ అధికారి ప్రదీప్ కుమార్

కథలాపూర్, అక్టోబర్ 30(ప్రజా ముద్ర న్యూస్) : కోరుట్ల నియోజకవర్గం కథలాపూర్ మండలం ఊట్పల్లి గ్రామ ప్రభుత్వం పాఠశాలను మండల పంచాయతీ అధికారి ప్రదీప్ కుమార్ సార్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ ముదం శేఖర్ పంచాయతీ కార్యదర్శి మాధవి, స్కూల్ హెడ్మాస్టర్ శ్రీనివాస్ రెడ్డి, పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం విద్యార్థులతో కలిసి పంచాయతీ అధికారి భోజనం చేశారు.