PRAJA MUDRA NEWS
Newspaper Banner
Date of Publish : 30 October 2026, 3:27 pm Posted by : PRAJA MUDRA NEWS

ఇందిరమ్మ ఇళ్ళు గృహప్రవేశానికి హాజరైన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

జగిత్యాల, అక్టోబర్ 30(ప్రజా ముద్ర న్యూస్) : జగిత్యాల నియోజకవర్గం మోరపల్లి గ్రామానికి చెందిన తెడ్డు సంధ్య డేవిడ్ గార్ల ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమానికి జగిత్యాల నియోజకవర్గం శాసనసభ్యులు డా.సంజయ్ కుమార్ హాజరై ఇందిరమ్మ ఇల్లును ప్రారంభించారు. సంధ్య డేవిడ్ కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే సంజయ్ శుభాకాంక్షలు తెలిపి చీర కానుకగా అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ కట్ట రాజేందర్, మాజీ సర్పంచ్ బొల్లె గంగారం, మాజీ ఎంపీటీసీ భూమారెడ్డి, నాయకులు సదానందం, కాంతయ్య, మైపాల్, విజయ్, గంగేష్, కొమురయ్య గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.